‘హైకూ’ మనల్ని ఎగ్జైట్ చేసే సిన్సియర్ లవ్ స్టోరీ.. మళ్లీ అందరినీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్

అక్టోబర్ 23న విడుదలవుతున్న ‘హైకూ’ తెలుగు ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. రచయిత, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు రామ్ జగదీశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Team Clapnumber · 2 min read
‘హైకూ’ మనల్ని ఎగ్జైట్ చేసే సిన్సియర్ లవ్ స్టోరీ.. మళ్లీ అందరినీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్

ఏగన్, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 23న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, డైరెక్టర్ రామ్ జగదీశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నా హార్ట్‌కి చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా కథ వినగానే బాగా నచ్చి వెంటనే ఓకే చేశా. లవ్‌లో ఉన్నా, రిలేషన్‌షిప్‌లో ఉన్నా, మ్యారీడ్ కపుల్స్ అయినా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. లవ్‌లో ఉండే కాంప్లికేషన్స్ మొత్తం ఈ సినిమాలో చూస్తారు. ఏగన్ డౌన్ టు ఎర్త్. ఆయనతో కలిసి పని చేయడం హ్యాపీగా అనిపించింది. నన్ను చాలా కూల్‌గా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. మా టీమ్ మొత్తం ఎంతో సహకరిస్తూ పని చేశారు. ఇది నా తమిళ డెబ్యూ. మీరంతా అక్టోబర్ 23న థియేటర్‌లో ఎంజాయ్ చేయండి’’ అన్నారు.

హీరో ఏగన్ మాట్లాడుతూ.. ‘‘నేను ఇండస్ట్రీకి కొత్త. హైకూ సినిమా క్లోజ్ టు మై హార్ట్. బాగా కష్టపడి సినిమా చేశాము. ఈ సినిమాపై నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సిద్దు కుమార్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి నాకు పదేళ్లుగా తెలుసు. ఇప్పుడు మేమిద్దరం కలిసి సినిమా చేశాము. 200 పర్సెంట్ హైదరాబాద్‌లో మళ్లీ హైకూ సక్సెస్ మీట్‌లో కలుద్దాం’’ అన్నారు.

డైరెక్టర్ రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. ‘‘

YouTube
హైకూ తమిళ సినిమా ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. హైకూకి నా పర్సనల్ స్పెషల్ ఇంట్రెస్ట్ జాబిలి (శ్రీదేవి). ఆమెకు ఇది తమిళ డెబ్యూ. ఆవిడ కళ్లతో ఏ భాష అయినా మాట్లాడగలదు. ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడింది. సినిమా ఔట్‌పుట్ చాలా ప్లెజెంట్‌గా వచ్చింది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. ఆల్ ది బెస్ట్ టు టీమ్’’ అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘‘హైకూ అక్టోబర్ 23న వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ చూడగానే కూల్‌గా, ఆహ్లాదంగా అనిపించింది. ముందే ఓటీటీకి అమ్మేసి అప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం నిజంగా గ్రేట్. నెట్‌ఫ్లిక్స్ వారికి స్టోరీ చెప్పి ఈ హైకూ తీశారంటే వాళ్లని ఈ స్క్రిప్ట్ ఎంత మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కథ కచ్చితంగా అందరినీ ఎగ్జైట్ చేస్తుంది. ఇది ఒక సిన్సియర్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో కాలేజ్ లైఫ్‌లోని బ్యూటిఫుల్ థింగ్స్ చూపించారు. మనల్ని మళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. స్పెషల్‌గా ఈ సినిమాను శ్రీదేవి కోసం చూడాలి. ఏగన్ వెల్‌కమ్ టు తెలుగు ఇండస్ట్రీ’’ అన్నారు.

YouTube

In this story

Read next

All news ›

The talk

0 · moderated
Sign in to join the talk

Be the first to clap back.